Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు గుడ్ల దాడి..
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు గుడ్లతో దాడి చేశారు.;
Ibrahimpatnam: సాగర్ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు గుడ్లతో దాడి చేశారు.. క్యాంప్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర అడ్డుకుని గుడ్లు విసిరారు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి సమయంలో కాంగ్రెస్ నాయకులకు, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది.. కాంగ్రెస్ నాయకులకు టీఆర్‌ఎస్ శ్రేణులు తరిమికొట్టాయి.. అయితే, తమపై దాడిచేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఎమ్మెల్యేని ఎన్‌ఎస్‌యూఐ నేతలు అడ్డుకున్నారు.. అయితే, పోలీసులు వారిని చెదరగొట్టారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.