ట్రాఫిక్ క్లియర్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్ హనుమంతరావు ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న పలు వాహనాలన ఆయనే దగ్గరుండి మరి క్లియర్ చేశారు.;
కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్ హనుమంతరావు ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న పలు వాహనాలన ఆయనే దగ్గరుండి మరి క్లియర్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని తల్లంపాడులో చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తు చేపడుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు హీహెచ్ హైదరాబాద్ నుంచి వెళ్తుండగా తల్లంపాడులో ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది.
దీనితో వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వీహెచ్ తానే స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, రేపు ఖమ్మం నగరంలో జరుగున్న కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశంలో కూడా వీహెచ్ పాల్గోననున్నారు.