Telangana Bhavan : తెలంగాణ భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్..టెన్షన్ టెన్షన్
హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నంచారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం ఏర్పడింది.
మరోవైపు.. హైడ్రా బాధితులకు బాసట పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. దీంతో.. కాంగ్రెస్ కౌంటర్ గేమ్ మొదలుపెట్టింది.