భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్యకు యత్నించే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏనుకూరుకు చెందిన సాగర్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. గతంలో బూర్గంపాడుకు చెందిన భారాస నాయకుడు.. అప్పటి ఎస్‌ఐతో సన్నిహితంగా ఉండి గంజాయి పక్కదోవపట్టించినట్టు ప్రచారం జరిగింది. గంజాయి లావాదేవీలన్నీ సాగర్ సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడే వారని తెలిసింది. గంజాయి కేసులో సాగర్‌ను పోలీసు అధికారులు 8 నెలల క్రితం సస్పెండ్ చేశారు. చేయని నేరానికి తనకు శిక్ష పడిన విషయంపై సాగర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి ఎస్‌ఐ బదిలీ అయిన తర్వాత ఎస్‌ఐగా వచ్చిన వారు వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి అమ్ముకొని తనను బలి పశువును చేశారని సాగర్ సెల్ఫీ వీడియో తీసుకుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా కానిస్టేబుల్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.