తెలంగాణలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1914 కేసులు నమోదు
తెలంగాణలో ఇప్పటి వరకు 17 వందల 34 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 11 వేల 617 యాక్టివ్ కేసులు ఉన్నాయి.;
తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 19 వందల 14 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 3 లక్షల 16 వేల 649కి కరోనా కేసులు చేరాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 17 వందల 34 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 11 వేల 617 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల 3 వేల 298 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కరోనా కొత్త కేసులు నమోదవగా.. మేడ్చల్‌లో 205, రంగారెడ్డిలో 169, నిజామాబాద్ జిల్లాలో 179 కేసులు నమోదయ్యాయి.