Telangana Corona Cases: గుడ్ న్యూస్..! తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం..
Telangana Corona Cases: తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.;
Telangana Corona Cases: తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగువేల చేరువలోంచి మూడున్నర వేలకు పాజిటివ్ కేసులు దిగివచ్చాయి. గత 24 గంటల్లో 3వేల 590 మంది కరోనా బారిన పడగా, నిన్నటితో పోలిస్తే దాదాపు నాలుగు వందల పాజిటివ్ కేసులు తగ్గాయి. మరో 3555 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరు కరోనాతో మృతి చెందారు.
కేస్ ఫెటాలిటీ రేట్ 0.54 శాతంగా ఉండగా, రికవరీ రేటు 94.13 శాతానికి చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో40వేల 447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24గంటల్లో ఏకంగా 95వేల 355 మందికి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు. ఇంకా 3960 టెస్ట్‌ల ఫలితాలు రావాల్సి ఉంది.