Warangal : వరంగల్ హైవేపై ఆవుల తరలింపు.. గో రక్షక్ దళ్ దాడి.. ఉద్రిక్తత

Update: 2025-01-02 09:45 GMT

తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గో రక్షక్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. డీసీఎం వాహనాన్ని ఆపకపోవడంతో ఓవర్ టేక్ చేసి వాహనాన్ని గో రక్షక్ దళ్ సభ్యులు ఆపారు. డ్రైవర్‌పై దాడి చేశారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను చికిత్స కోసం ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘట్‌కేసర్ పీఎస్‌కి ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్సీ రహమత్ బెగ్, కిషన్ బాగ్ కార్పొరేటర్ ఖాజా ముబెశరుద్దీన్ చేరుకున్నారు. ఇటు బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి సహా ఇతర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు.. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘట్‌కేసర్ పీఎస్‌ వద్ద పరిస్థితిని మల్కాజ్‌గిరి ఏసీపీ సమీక్షిస్తున్నారు. 

Tags:    

Similar News