CP Tarun Joshi : డ్రగ్స్, నకిలీ పత్తి విత్తనాలను అరికట్టాలి : సీపీ తరుణ్ జోషి

Update: 2024-05-31 05:07 GMT

ఘట్ కేసర్, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలు, డ్రగ్స్ సరఫరాను అరికట్టాలని, అంతర్ రాష్ట్ర ముఠాలను అణచివేసి పీడీ యాక్టులు ప్రయోగించాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి చెప్పారు. ఘట్ కేసర్ లోని ఏస్ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం రాచకొండ కమిషనరేట్​పరిధిలోని డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారులతో సీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనరేట్​పరిధిలో ఇప్పటి వరకు ఎన్డీపీఎస్ చట్టం కింద 92 కేసులు నమోదయ్యాయని, 181 మందిని అరెస్ట్​చేశామని సీపీ తరుణ్​జోషి చెప్పారు. విచారణలో పాటించాల్సిన నూతన విధానాల మీద అధికారులు, సిబ్బంది సంపూర్ణ అవగహన కలిగి ఉండాలని సూచించారు. రిటైర్డు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు నూతన చట్టాల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేశ్​చంద్ర, ఎల్ బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఎస్బీ డీసీపీ కరుణాకర్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ సైబర్ క్రైమ్ చంద్రమోహన్, డీసీపీ ఎస్ఓటి మురళీధర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News