Cyberabad Traffic Police: హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్ప? ట్రాఫిక్ పోలీస్ క్రియేటివ్ పోస్ట్..

Cyberabad Traffic Police: ట్రాఫిక్ నిబంధనల గురించి, దాని ఉల్లంఘన వల్ల జరిగే పరిణామాల గురించి చాలావరకు వాహనదారులకు తెలుసు

Update: 2021-12-17 12:07 GMT

Cyberabad Traffic Police: ట్రాఫిక్ నిబంధనల గురించి, దాని ఉల్లంఘన వల్ల జరిగే పరిణామాల గురించి చాలావరకు వాహనదారులకు తెలుసు. కానీ అందులో చాలామంది చిన్న చిన్న రూల్స్‌ను కూడా పాటించలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అందుకే మామూలుగా చెప్తే ప్రజలు వినట్లేదని, కాస్త క్రియేటివిటీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

సినిమా పోస్టర్లను ఉపయోగిస్తూ.. ఈ మధ్య చాలామంది ఇష్టపడే మీమ్స్ రూపంలో ట్రాఫిక్ రూల్స్‌ను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా పోస్టర్లను ఉపయోగిస్తూ, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌ను ఉపయోగిస్తూ వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిపారు. తాజాగా పుష్ప సినిమా పోస్టర్‌తో కూడా తమ క్రియేటివిటీని చూపించారు.

పుష్ప సినిమా నుండి ఇప్పటివరకు చాలా పోస్టర్లు విడుదల అయ్యాయి. అందులో అల్లు అర్జున్ బైక్ పై కూర్చున్న పోస్టర్ కూడా ఒకటి ఉంది. అయితే ఈ పోస్టర్‌ను తీసుకొని, ట్రైలర్‌లో ఫాహద్ ఫాజిల్ చెప్పిన 'పార్టీ లేదా పుష్ప' డైలాగును 'హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్ప'గా మార్చి ఓ మీమ్ రూపంలో బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్, మిర్రర్స్ ముఖ్యమని గుర్తుచేస్తున్నారు.


Tags:    

Similar News