సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు : దానం నాగేందర్
సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు మానుకొని మానవత్వంతో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఖైరాతాబాద్ నియోజకవర్గంలోని బషీర్‌బాగ్ ఓల్డ్ కమేల బస్తీలో వర్షాలు కారణంగా ఇల్లు కూలిపోయిన బాధితులను ఆయన పరామర్శించారు. అత్యవసర వరద సాయం కింద ఎనిమిది కుటంబాలకు పది వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి నష్ట పరిహారాన్ని బాధితులకు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.