భువనగిరి జిల్లాలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు
తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి;
తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నారాయణపురం పోలీసుల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత పాలనలో పోలీసులు అంటేనే జనం భయపడేవారని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు.