రైతు డెవలప్ మెంట్ కు రెండు సూత్రాలు పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన బీఆర్కే భవన్‌లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం, రైతు సంక్షేమం అని రెండుగా విభజించుకుని ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తుందన్నారు. రైతుకి ఒకప్పుడు సమాజంలో బాగా గౌరవం ఉండేదని, కానీ గడిచిన పదేళ్లలో ఈ పరిస్థితులు కానరావడం లేదన్నారు. రైతు తనకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెరిగి అనేకమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సాహసోపేతమైన, ఆర్థికపరమైన నిర్ణయం తీసుకొని ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేశారన్నారు.