Maha Shivaratri : మహాశివరాత్రి ఉత్సవాలకు వేయిస్తంభాల గుడి రెడీ

Update: 2024-03-07 05:36 GMT

హనుమకొండలోని (Hanumakonda) వేయిస్తంభాల గుడిలో (Veyyi Stambala temple) గురువారం నుంచి మహాశివరాత్రి (Shivratri) మహోత్స వాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నా యి. ఉదయం 5 గంటలకు సుప్రభాత, మంగళవాయిద్య సేవ, ఉత్తిష్ట గణపతి పూజ, రుద్రేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, యాగశాలలో గణపతి నవగ్రహారాధన, అంకురారోహణ, వాస్తుపూజ కలశా రాధన రుత్విక్‌హరణ, మంటపారాధన, లోక కల్యా ణార్థం నమక, చమకాదులతో రుద్ర అద్యాయంతో రుద్రహోమం, మహాచండీయాగం నిర్వహిస్తారు.

జ్యోతి ప్రజ్వలనతో ఐదురోజుల బ్రహ్మోత్సవాలు ప్రా రంభమవుతాయి. ఈనెల 8వ తేదీన శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉద యం 3 గంటల నుంచి రుద్రేశ్వరస్వామికి ఆఘో రపాశుపత రుద్రాభిషేకాలు, సాయంత్రం 6.59 గం టలకు రుద్రేశ్వరస్వామివారి కల్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో 112 రుద్రాలతో లింగోద్భవ కాలపూజ ఉంటాయని ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.

మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంతో ఆవరణ అంతా షామియాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మూడు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News