డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు తాత్కాలిక ఉపశమనం దొరికింది. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ఆయనకు.. 21 రోజుల పాటు జైలు నుంచి బయటకు రావడానికి హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
ఈ ఉదయం 6:30 గంటలకు హర్యానాలోని సరోహక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి డేరాబాబా విడుదలయ్యారు. ఈ 21 రోజులూ ఆయన ఉత్తరప్రదేశ్లోని బర్నావాలో ఉన్న డేరా ఆశ్రమంలో బస చేస్తారని సమాచారం. కాగా, ఆయనకు 2017లో జైలు శిక్ష పడింది.