Kushitha Kallapu Drugs Case: మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్న ఫుడ్ అండ్ మింక్ పబ్.. పట్టుబడ్డ యూట్యూబర్..
Kushitha Kallapu Drugs Case: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది;
Kushitha Kallapu (tv5news.in)
Kushitha Kallapu Drugs Case: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పబ్‌లో మైనర్లకు కూడా మందు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించిన సమయంలో ఆరుగురు మైనర్లు పట్టుపడ్డారు. ఈ క్రమంలో తామేం తప్పు చేశామంటూ కుషిత అనే యువతి వీడియో రిలీజ్ చేసింది. ఆమె వయసు ఆధార్‌లో డేటాఫ్ బర్త్ ప్రకారం చూస్తే.. 20 ఏళ్లు కూడా లేవు. నిబంధనల ప్రకారం 21 సంవత్సరాలు నిండిన వారికే మద్యం సరఫరా చేయాలని తెలంగాణ ఆబ్కారీ శాఖ చెబుతోంది. దీంతో కుషితను కూడా పబ్‌లోకి అనుమతించారంటే నిబంధనలు ఎలా లైట్ తీసుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.