అసిఫాబాద్ జిల్లాలో నాలుగో రోజు డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది..;
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నుంచి పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండు నెలల క్రితం టోక్కిగూడలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా మావోయిస్టు భాస్కర్ రావు రాసిన డైరీ లభ్యమైంది. రెండు నెలలుగా మళ్లీ అలజడి కనిపించలేదు. అయితే డీజీపీ పర్యటనపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు తిర్యాణి పీఎస్‌ను డీజీపీ సందర్శించారు.