DH srinivas: తెలంగాణలో థర్డ్‌వేవ్ ముగిసింది: డీహెచ్ శ్రీనివాస్
DH srinivas: తెలంగాణలో థర్డ్‌వేవ్ ముగిసిందని ప్రకటించారు డీహెచ్ శ్రీనివాస్.;
DH srinivas: తెలంగాణలో థర్డ్‌వేవ్ ముగిసిందని ప్రకటించారు డీహెచ్ శ్రీనివాస్. తెలంగాణ ప్రజలంతా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని స్టేట్‌మెంట్ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి వేరియెంట్లు పుట్టుకొచ్చినా ఎదుర్కోగలమన్నారు. తెలంగాణలో కరోనా ఆంక్షలేవీ లేవని స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేయనక్కర్లేదని డీచ్ శ్రీనివాస్ ప్రకటించారు. మేడారం జాతరలోనూ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. థర్డ్‌వేవ్ పెద్దగా ప్రభావం చూపకపోవడానికి వ్యాక్సినేషనే కారణమని, టీకా తీసుకున్న వారిపై కరోనా తక్కువ ప్రభావమే చూపించిందని అన్నారు.