ధరణి పోర్టల్‌ను విజయవంతం చేయాలి : సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను విజయవంతం చేయాలన్నారు సీఎం కేసీఆర్‌. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల..

Update: 2020-11-14 05:04 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను విజయవంతం చేయాలన్నారు సీఎం కేసీఆర్‌. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం దేశంలో ఎక్కడా ఇలాంటి పోర్టల్‌ లేదని చెప్పారు. నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధరణి పోర్టల్‌పైనే ప్రధానంగా చర్చించారు. ధరణి పోర్టల్‌ను ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని మంత్రులను ఆదేశించారు. ఈ పోర్టల్‌కు చాలా ప్రాధాన్యం ఉందని, దీన్ని గుర్తించి పనిచేయాలని చెప్పారు.

ధరణి పోర్టల్‌ రాష్ట్ర ప్రజానీకానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆస్తి వివాదాలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ఆ కారణంతో శాంతిభద్రతల సమస్యలూ తలెత్తవని అన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ధరణి పోర్టల్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. .అదే సమయంలో ధరణి పోర్టల్‌ వల్ల తలెత్తే సమస్యలు, లోటుపాట్లను తెలుసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Tags:    

Similar News