Dharani Portal : ధరణి పోర్టల్ తాత్కాలికంగా బంద్

Update: 2024-12-13 05:45 GMT

డేటా బేస్‌లో మార్పుల కారణంగా ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు డేటాబేస్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఈ మధ్య కాలంలో పోర్టల్‌లో సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. నిజానికి గత మూడు రోజుల నుంచే ధరణి సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి ధరణి ఓటీపీలు కూడా రావడం లేదని మీ సేవా నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందు రెండు రోజులు ధరణి పోర్టల్‌ ద్వారా కేవలం సేల్‌ డీడ్‌ మాత్రమే అయ్యాయని చెబుతున్నారు. టీఎం 33, గిఫ్ట్‌ డీడ్స్‌ వంటి మాడ్యుల్స్‌ పనిచేయలేదని అంటున్నారు.

Tags:    

Similar News