హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్‌లో గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది మంది అభ్యర్థులు తెల్లవారుజామునే ప్రజా భవన్ కు వచ్చారు. గురుకుల టీచర్ల పోస్టింగుల్లో నియమ నిబంధనలు పాటించలేదని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. రూల్స్ పాటించకపోవడంతో భారీగా బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాసి అర్హత ఉన్నా ఉద్యోగాలు రాలేదని చెప్పారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకులాల్లోని ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులైన అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.