Passenger Plane : ప్యాసింజర్ విమానానికి తప్పిన భారీ ప్రమాదం

Update: 2024-06-20 07:06 GMT

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ ( Malaysia )కు వెళ్తున్న విమానానికి ముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ అలెర్ట్ అయ్యాడు.

పైలట్ వెంటనే ల్యాండింగ్ కు అనుమతి కోరారు. శంషాబాద్ ATC అధికారులు విమానాన్ని కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు. ప్రమాద తీవ్రతను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతించారు.

విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అందులోని 138 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ పోర్ట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News