హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ సమస్యతో పలు స్టేషన్లు మూతపడ్డాయి. దీంతో ఉదయం కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగోల్-రాయదుర్గం మార్గంలోనే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు.
దీనిపై హైదరాబాద్ మెట్రో ప్రకటన విడుదల చేసింది.. సిగ్నలింగ్ సిస్టమ్ సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని.. తాము సమస్యను పరిష్కరించడానికి తక్షణమే పని చేసామని చెప్పింది. సాధారణ సేవలు పునరుద్ధరించామని.. దీని వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ తెలిపింది.