Komaram Bheem District: ఆర్ఎంపీ వైద్యుడే కీచకుడు.. 9 నెలల చిన్నారిని అమ్మేసి..
Komaram Bheem District: కొమురం భీం జిల్లాలో కన్నతల్లి పొత్తిళ్ల నుంచి చిన్నారిని వేరు చేశాడో ఆర్ఎంపీ వైద్యుడు.;
Komaram Bheem District: కొమురం భీం జిల్లాలో కన్నతల్లి పొత్తిళ్ల నుంచి చిన్నారిని వేరు చేశాడో ఆర్ఎంపీ వైద్యుడు. ఆ చిన్నారికి 9 నెలలు వచ్చాక అమ్ముకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెబ్బన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది. తన బిడ్డను తనకు ఇప్పించాలని ఆ తల్లి.. ఆర్ఎంపీ మనోహర్ ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. ఆమెకు స్థానిక సర్పంచ్, మహిళా సంఘాల నాయకులు మద్దుతుగా నిలిచారు. ఆర్ఎంపీ మనోహర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన బిడ్డను తనకు ఇచ్చేంత వరకు ఆందోళనను కొనసాగిస్తానని బాధితురాలు తెలిపారు.