ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో మందుబాబుల హల్‌చల్..!
ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో మందుబాబులు హల్‌చల్ చేశారు. కర్నూలు పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో ఓ ఆటో, లారీ అద్దాలు ధ్వంసం కాగా.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.;
ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో మందుబాబులు హల్‌చల్ చేశారు. కర్నూలు పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో ఓ ఆటో, లారీ అద్దాలు ధ్వంసం కాగా.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మందుబాబుల ధర్నాతో అరగంటకు పైగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తెలంగాణ సర్కారు ఇటీవల కొత్తగా మద్యం షాపును ఏర్పాటు చేసింది. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటం, తెలంగాణలో తక్కువగా రేట్లు ఉండటంతో కర్నూలు నుంచి పెద్ద ఎత్తున మద్యం ప్రియులు క్యూ కట్టారు. అయితే మద్యం షాపునకు పది అడుగుల దూరంలో తెలంగాణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మందు తాగి వచ్చిన మందుబాబుల బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. దీంతో తెలంగాణ పోలీసుల వైఖరికి నిరసనగా మద్యం ప్రియులు రాస్తారోకో నిర్వహించారు.