దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో దూసుకెళుతోన్న టీఆర్‌ఎస్
దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళుతోంది. ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం ముబారాస్పూర్..;
దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళుతోంది. ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం ముబారాస్పూర్ గ్రామంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దివంగత నేత రామలింగారెడ్డి స్థానంలో ఆయన సతీమణి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు మంత్రి. ఎన్నికల కోసం.. కాంగ్రెస్ నేతలు సుట్కేసులు పట్టుకుని రాష్ట్ర నలుమూలల నుంచి వాలిపోతున్నారని..వారిని నమ్మొద్దని హరీష్‌రావు ఓటర్లకు పిలుపునిచ్చారు.