ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి మరిన్ని సంస్కరణలు : మంత్రి కేటీఆర్‌

Update: 2020-09-23 14:59 GMT

తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి మరిన్ని సంస్కరణలు తేనున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపుపై పలు శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఆయన సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు సైతం అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు కేటీఆర్‌. ఈ సందర్భంగా న్యాయ, టూరిజం, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, సివిల్ సప్లై, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌, సిసిఎల్ఎ వంటి పలు శాఖలపైన మంత్రి ఆయా సెక్రటరీలకు వివరాలు అందజేసి, చేపట్టాల్సిన సంస్కరణలపై సలహాలు, సూచనలను చేశారు. కొన్ని సంస్కరణలను ఒక నెలలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా వేగంగా పని చేయాలన్నారు. సంస్కరణలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తే వాటిని పర్యవేక్షణ చేసేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక చట్టం టిఎస్ బి-పాస్ అమలుపైనా మంత్రి కేటీఆర్ వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించారు. టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా పౌరులకి అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా.. భవన నిర్మాణ అనుమతులను, లేఅవుట్ల అనుమతులు ఇస్తోందని అన్నారు. ఇప్పటికే చట్టంగా రూపొందినదని, తర్వాత దాని అమలుకు సంబంధించిన కార్యక్రమాల పైన వివిధ శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ పలు సూచనలు ఇచ్చారు. త్వరలోనే శాఖలన్నీ సమన్వయంతో క్షేత్రస్థాయిలో టిఎస్‌ బి-పాస్ అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News