గులాబీ బాస్ కేసీఆర్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపింది. కాంగ్రెస్ నేతలపై తప్పుడు వ్యాఖ్యలు, అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ వివరణ కోరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గురువారం ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ కు ఈ నోటీసులను పంపింది ఈసీ. "బతుకుదెరువు కోసం నిరోధ్‌లను అమ్ముకోవాలని ఓ కాంగ్రెస్ వాది అన్నారు. నిరోధ్‌లు అమ్ముకుని బతకాలా కుక్కల కొడుకుల్లారా!? నీటి సామర్థ్యంపై అవగాహన లేని 'లత్‌ఖోర్లు' రాజ్యాన్ని పాలిస్తున్నారు. అసమర్థ 'చవట దద్ధమ్మ'లు రాజ్యంలో ఉన్నందున ఈ పరిస్థితి ఏర్పడింది. మీ ప్రభుత్వం 'లత్‌కోర్ల' ప్రభుత్వం. మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతకాని చవటలు అని అర్థం. ఐదు వందలు బోనస్ ఇవ్వడంలో విఫలమైతే మీ గొంతు కోస్తాం." లాంటి కామెంట్లను ఎందుకు వాడారో చెప్పాలని కేసీఆర్ ను అడిగింది ఈసీ.