ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాంలో కేసీఆర్ పాత్ర ఉందని ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. లిక్కర్ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ సంచలన వాదనలు వినిపించింది. ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా విస్తుపోయే విషయాలు బయటపెట్టింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్‌కు కవిత ముందే చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్‌కు ఆయన అధికారిక నివాసంలోనే కవిత పరిచయం చేశారని ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ తాజా వాదనలు తెలంగాణలో రాజకీయ సంచలనం రేపుతున్నాయి.