బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఏసీబీ రిమాండ్ కు తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామునే నుంచే దాడులకు దిగిన ఈడీ అధికారులు..రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే ఆరు చోట్ల తనిఖీలు చేసిన పోలీసులు.. గొర్రెల పంపిణీ కేసులో కూపీ లాగుతున్నారు. గొర్రెల పంపిణీ కేసులో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని అధికారులు తెలిపారు. పలువురు అధికారులు విచారణ లో వెల్లడించిన వివరాల ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు.