TS Inter Exams 2021: ఇంటర్ పరీక్షల కేంద్రాలు, నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టత..
TS Inter Exams 2021: ఇంటర్ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sabitha Indra Reddy (tv5news.in)
TS Inter Exams 2021: తెలంగాణలో ఈనెల 25 న జరగబోయే ఇంటర్ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో కరోనా కారణంగా ప్రమోట్ చేసిన విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నామని మంత్రి సబిత స్పష్టం చేశారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు.
కరోనా కారణంగా పరీక్ష కేంద్రాలను 1750 కి పెంచుతున్నామని అన్నారు. పరీక్షల నిర్వహణలో 25 వేల మంది ఇన్విజిలేటర్లు పాల్గొంటున్నారని వెల్లడించారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంటముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. ఈనేపథ్యంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యజామాన్యాలు పరీక్ష నిర్వహణకు సహాకరించాలని మంత్రి సబిత పేర్కొన్నారు.