TG: తెలంగాణలోనూ హోరెత్తుతున్న ప్రచారం
క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ తమకే మద్దతు పలకాలంటూ అభ్యర్థన... నియోజకవర్గాలోకాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతల పర్యటన;
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ తమకే మద్దతు పలకాలంటూ అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన నాయకులు నియోజకవర్గాలో విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లు అడుగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఆదిలాబాద్ బూత్ స్థాయి సమన్వయకర్తల సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క హాజరయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పార్లమెంటరీస్థాయి ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. రామగుండం రాష్ట్రంలోకెల్లా ఆదర్శ కార్పొరేషన్‌గా మారాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని . ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల మంత్రిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కొత్త ప్రభుత్వానికి కనీసం రెండేళ్లైన సమయం ఇవ్వకుండా ప్రధాన ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోందని ఆక్షేపించారు.
హైదరాబాద్ మెహిదీపట్నంలో నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌కార్యకర్తల సమావేశంలో MP అభ్యర్థి దానంనాగేందర్, మేయర్ విజయలక్ష్మిపాల్గొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన తప్పిదాలతో తెలంగాణలో కరువుపరిస్థితులు నెలకొన్నాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అన్నదాతలపై కపట ప్రేమ చూపుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాల్లో పర్యటించినఆయన... అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని నాగర్‌కర్నూల్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, R.S ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. తెలంగాణలో తాగునీటి సమస్యకు కాంగ్రెస్ కారణమని ఆరోపించిన గులాబీపార్టీ నేతలు.. వందరోజుల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏనాడు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై మాట్లాడలేదని బీఆర్‌ెస్ ఖమ్మం MP అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా చిమ్మపూడిలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ గళం వినిపించే సత్తా ఉన్న గులాబీ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఉదయపు నడకలో భాగంగా ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఎంపీగా ఉన్నపుడు చేసిన పనులను వివరించుకుంటూ...మరోసారి ఢిల్లీకి పంపాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్ మాట మార్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట బీఆర్‌ఎస్ కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, భాజపా నిరుద్యోగులను దగా చేశాయని మండిపడ్డారు