ELECTIONS: మోగిన స్థానిక నగారా... గ్రామాల్లో రాజకీయ వేడి

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల... రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణ

Update: 2025-09-30 02:30 GMT

తె­లం­గా­ణ­లో స్థా­నిక ఎన్ని­క­ల­కు నగా­రా మో­గిం­ది. ఎం­పీ­టీ­సీ, జడ్పీ­టీ­సీ, గ్రామ పం­చా­య­తీ ఎన్ని­క­ల­కు షె­డ్యూ­ల్‌­ను తె­లం­గాణ రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న­ర్‌ (ఎస్‌­ఈ­సీ) రా­ణి­కు­ము­ది­ని వె­ల్ల­డిం­చా­రు. మొ­త్తం ఐదు దశ­ల్లో ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు ఆమె తె­లి­పా­రు. తొలి రెం­డు దశ­ల్లో ఎం­పీ­టీ­సీ, జడ్పీ­టీ­సీ.. మి­గ­తా మూడు దశ­ల్లో గ్రామ పం­చా­య­తీ ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తా­మ­ని వి­వ­రిం­చా­రు. అక్టో­బ­ర్ 9న స్థా­నిక ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­స్తా­మ­ని తె­లి­పా­రు. 31 జి­ల్లా­ల్లో 565 మం­డ­లా­ల్లో రెం­డు వి­డ­త­ల్లో 5,749 ఎం­పీ­టీ­సీ, 656 జె­డ్పీ­టీ­సీ ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తా­మ­ని అన్నా­రు. పం­చా­య­తీ ఎన్ని­క­ల­ను మూడు వి­డ­త­ల్లో ని­ర్వ­హి­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. స్థా­నిక ఎన్ని­కల ని­ర్వ­హణ ప్ర­క్రియ అక్టో­బ­ర్ 9న ప్రా­రం­భ­మై.. నవం­బ­ర్ 9తో ము­గు­స్తుం­ద­ని తె­లి­పా­రు. తె­లం­గాణ రా­ష్ట్రం­లో ఎన్ని­కల కోడ్ అమ­ల్లో­కి వచ్చిం­ద­ని ప్ర­క­టిం­చా­రు. అక్టో­బ­ర్ 23, 27న ఎం­పీ­టీ­సీ ఎన్ని­క­లు, అక్టో­బ­ర్ 31, నవం­బ­ర్ 4, 8 తే­దీ­ల్లో పం­చా­య­తీ ఎన్ని­క­ల­ను వి­డ­తల వా­రీ­గా ని­ర్వ­హి­స్తా­మ­ని తె­లి­పా­రు. నవం­బ­ర్ 11న ఎం­పీ­టీ­సీ, జె­డ్పీ­టీ­సీ ఫలి­తా­లు, పం­చా­య­తీ ఎన్ని­కల రి­జ­ల్ట్స్ పో­లిం­గ్ రోజు సా­యం­త్ర­మే వె­ల్ల­డి­స్తా­మ­ని రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న­ర్ రాణి కు­ము­ది­ని ప్ర­క­టిం­చా­రు. పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలను నిర్వహిస్తామని వెల్లడించారు. రా­ష్ట్రం­లో 31 జి­ల్లా­ల్లో­ని 565 మం­డ­లా­ల్లో ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తా­మ­ని చె­ప్పా­రు. 5,749 ఎం­పీ­టీ­సీ, 565 జడ్పీ­టీ­సీ స్థా­నా­ల­కు ఎన్ని­క­లు జరు­గు­తా­య­న్నా­రు. 12,733 గ్రా­మ­పం­చా­య­తీ­లు, 1,12,288 వా­ర్డు­ల్లో ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు రా­ణి­కు­ము­ది­ని వి­వ­రిం­చా­రు.

తేలిన ఓటర్ల లెక్క..

రా­ష్ట్రం­లో  గ్రా­మీణ జనా­భా1.95 కో­ట్లు ఉం­డ­గా..  గ్రా­మీణ ఓట­ర్లు 1,67,03,168 మంది ఉన్న­ట్లు లె­క్క తే­లిం­ది.  ఇం­దు­లో మహి­ళా ఓట­ర్లు 85,35,935,  పు­రు­షు ఓట­ర్లు 81,66,732  మంది ఉం­డ­గా.. ఇత­రు­లు 501మంది ఉన్నా­రు.  గ్రా­మీణ ఓట­ర్ల జా­బి­తా­లో సిం­హ­భా­గం మహి­ళ­లే ఉం­డ­టం వి­శే­షం.. దీం­తో లో­క­ల్ బాడీ ఎన్ని­క­ల్లో అతి­వల ఓట్లు కీ­ల­కం కా­ను­న్నా­యి. పు­రుష ఓట­ర్ల కంటే దా­దా­పు 4 లక్ష­ల­పై­గా మహి­ళా ఓట­ర్లు ఎక్కు­వ­గా ఉన్నా­రు. ఇప్ప­టి­కే ఆర్వో­లు, ఏఆ­ర్వో­లు, పీ­వో­లు, ఏపీ­వో­ల­కు జి­ల్లా­ల్లో శి­క్షణ కొ­న­సా­గు­తోం­ది. స్థా­నిక సం­స్థల ఎన్ని­కల నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల కా­వ­డం­తో గ్రా­మా­ల్లో రా­జ­కీ­యాల వేడి పె­రి­గిం­ది. ఇప్ప­టి­కే ఆశా­వ­హు­లు ప్ర­చా­రా­న్ని ప్రా­రం­భిం­చ­గా రి­జ­ర్వే­ష­న్ల­తో కొం­ద­రు అసం­తృ­ప్తి­కి గు­ర­య్యా­రు. ఇక రా­ను­న్న రో­జు­ల్లో గ్రా­మా­ల్లో సర్పం­చ్ ఎన్ని­కల వేడి మరింత పె­ర­గ­నుం­ది.

Tags:    

Similar News