ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో పురోగమించి అఖండ భారత్‌గా నిలుస్తుందని ఆకాంక్షించారు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రీయ ఏక్తా దివాస్‌లో భాగంగా పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించారు. కూకట్‌పల్లిలోని సర్దార్ పటేల్ నగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. భారతదేశంలో హైదరాబాద్ విలీనానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. పటేల్ ముందుచూపుతో అలా కాకపోతే నేడు మన హైదరాబాద్ పాకిస్తాన్‌లో భాగంగా ఉండేదన్నారు. దేశం గురించి స్వాతంత్ర సమరయోధుల గురించి చిన్నతనం నుంచే చిన్నారులకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.