మొదలైన ఈటల రాజేందర్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు..!
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా జీవన యాత్ర పేరిట ఈ పాదయాత్రను ఈటల చేపట్టారు.;
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా జీవన యాత్ర పేరిట ఈ పాదయాత్రను ఈటల చేపట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల.. అనంతరం పాదయాత్రను మొదలుపెట్టారు. మా పాదయాత్రకు అనుమతులు తీసుకున్నా..అడ్డుంకులు సృష్టిస్తున్నారని ఈటల విమర్శించారు.ఓడిపోతామనే భయంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుంకులు సృష్టిస్తోందన్నారు ఈటల. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా 23 రోజులపాటు పాదయాత్ర కొనసాగనున్నది. భారీగా తరలివచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతోపాటు సీనియర్ నేతలు పాదయాత్రకు తరలివచ్చారు.