Telangana : తెలంగాణలో మాస్క్ వేసుకోకపోతే రూ.1000 ఫైన్..!
Telangana : మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి..;
Telangana : మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి.. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధిస్తోంది.. మాస్క్ వేసుకోకపోతే రూ.1000 ఫైన్ విధిస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజుకు 20-25 కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు.. తెలంగాణ వ్యాప్తంగా ఈ రెండు నెలల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫోర్త్ వేవ్ నుంచి బయటపడాలంటే మాస్కు, వ్యాక్సిన్ తప్పనిసరని స్పష్టం చేశారు..