ఆస్తి కోసం కన్న తండ్రినే కిడ్నాప్ చేశారు కసాయి కొడుకులు. తమ్ముడికి ఆస్తి దక్కుతుందేమోనన్న అనుమానంతో తండ్రిని అపహరించుకు వెళ్లారు. ఈ ఘటన సూర్యాపేటలో జరిగింది. సంజీవరావు ఎమ్మార్వోగా పనిచేసి రిటైర్ అయ్యారు. ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు స్థిరపడ్డారు. రవీందర్ ఎల్‌ఐసీ ఆఫీసులో పనిచేస్తుంటే, దయాకర్ గవర్నమెంటు టీచర్‌గా చేస్తున్నారు. మరో కుమారుడు ఎలక్ట్రీషియన్ పనులతో కుటుంబాన్ని పోషిస్తుండడంతో.. తండ్రి అప్పుడప్పుడు డబ్బు సాయం చేస్తున్నాడు. ఇది మిగతా ఇద్దరు సోదరులకు నచ్చలేదు. భవిష్యత్‌లో ఉన్న ఐదెకరాల పొలం కూడా తమ్ముడికే ఇచ్చేస్తారన్న అనుమానంతో తండ్రితో గొడవకు దిగారు.
తండ్రి పేరుపై రామన్నపేట మండలం పల్లివాడలో ఉన్న భూమి కోసమే కొడుకులిద్దరూ ఈ కిడ్నాప్ చేశారు. తల్లి సరోజపై దాడి చేసి.. బలవంతంగా తండ్రిని కారులో ఎక్కించుకెళ్లారు. భర్త ఆచూకీ కోసం తల్లి సరోజ కన్నీరుపెడుతోంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.