మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై ఉత్కంఠ..!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఈటల కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.;
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఈటల కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. రెండు రోజులుగా మద్దతుదారుల అభిప్రాయాలు తీసుకుంటున్న ఈటల.. పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ నియోజకవర్గంలో మరిన్ని సంప్రదింపుల తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారని.. సాయంత్రం హైదరాబాద్‌లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది.