హైదరాబాద్ అమీర్‌పేట్‌లో తెల్లవారు జామున జరిగిన పేలుడు స్థానికంగా అలజడి రేపింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలింది. ఈ పేలుడులో కేఫ్‌లో పనిచేసే ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఘటన జరిగింది. ఆ సమయంలో కేఫ్ లో కస్టమర్లు ఎవరూ లేరని తెలుస్తోంది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు , క్లూస్ టీం స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు.