Harish Rao : కుటుంబ సర్వే పత్రాలు రోడ్డు పాలు... హరీష్ ఫైర్

Update: 2024-11-23 14:30 GMT

ప్రజా వివరాల సేకరణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, అందుకు నిదర్శనమే రోడ్లపై సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమైందని శుక్రవారం ఎక్స్ర్వేదికగా హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్ పరిధిలోని తార్నాక మెట్రో స్టేషన్ వద్ద సర్వేకు సంబంధించిన పత్రాలు పడిఉన్న వీడియో ఒకటి సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే వీడియోను హరీష్ రావు తన ఎక్స్ వేదికలో పోస్టు చేశారు. రోడ్డుపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలు బట్టబయలు చేయడమేనా మీ సర్వేలక్ష్యం? అంటూ హరీష్ రావ్ ప్రశ్నించారు. రోడ్డునపడ్డ సమగ్రకుటుంబ సర్వే పత్రాలు సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై సమగ్రసర్వే పత్రాలు దర్శనమిస్తున్న ఘటనలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం, అధికారులు సీరియస్గా స్పందించి, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News