తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథంను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఈ మేరకు శుక్రవారం మందా జగన్నాథంను నిమ్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బీరప్ప ఇతర వైద్యులను అడిగి మందా ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల బృందానికి సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా.. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా. మందా జగన్నాథంను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.