వరంగల్-హైదరాబాద్ హైవేపై కారు ట్రక్కును ఢీకొనడంతో ఓ మహిళ, ఆమె కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు గాయపడి భువనగిరిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు మహబూబాబాద్‌లోని కీసముద్రం మండలం వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. పొగమంచు అధికంగా ఉండటంతో పాటు అధికవేగంగా వచ్చి వేగంగా వెనక నుంచి కారు లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఘటన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వెనక సీట్లో కూర్చున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. భువనగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.