Fire Accident: హైదరాబాద్‌‌లో భారీ అగ్ని ప్రమాదం..

తండ్రీ కూతుర్లు మృతి;

Update: 2024-07-24 06:45 GMT

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతిచెందారు. అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను మార్పాలనుకునేలోపే పై అంతస్తులకు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పై అంతస్తుల్లో చిక్కుకుపోయిన ఏడు కుటుంబాల వారిని రక్షించారు. అయితే రెండో సఅంతస్తులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసలు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పదేండ్ల బాలిక శివప్రియ మరణించగా, మరికొద్ది సేపటికే ఆమె తండ్రి శ్రీనివాస్‌ కూడా మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News