Free Services In Petrol Bunk: ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సేవలు కూడా..
Free Services In Petrol Bunk: పెట్రోల్, డీజిల్ రేట్లు ఒకప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి.;
Petrol Bunk (tv5news.in)
Free Services In Petrol Bunk: పెట్రోల్, డీజిల్ రేట్లు ఒకప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి. ప్రస్తుతం ఆ రేట్లకు అలవాటు పడిపోయారు ప్రజలు. కానీ పెట్రోల్ బంకుల్లో ఇంతకు ముందున్న సేవలు మాత్రమే కాకుండా ప్రజల కోసం మరికొన్ని ఉచిత సేవలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా వాటిలో ఏ సౌకర్యం లేకపోయినా చమురు మార్కెట్ సంస్థకు ఫిర్యాదు చేసే అవకాశం ప్రజలకు కల్పిస్తోంది.
ప్రతీ పెట్రోల్ బంకులో కచ్చితంగా మంచినీటి వసతి ఉండేలా యజమానులు చూసుకోవాలి. ఇంతకు ముందు కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే మరుగుదొడ్లు, మూత్రశాలల సదుపాయం ఉండేది. కానీ ఇప్పటినుండి ప్రతీ పెట్రోల్ బంకులో కచ్చితంగా టాయిలెట్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ లేకపోతే యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది.
మామూలుగా పెట్రోల్ బంకుల్లో ఫోన్ ఉపయోగించకూడదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో బంకులోకి వచ్చేవారికి ఫోన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా టైర్లలో గాలి నింపే యంత్రాలు కూడా ఇకపై ప్రతీ పెట్రోల్ బంకులో ఉండేలా సదుపాయం కల్పించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ప్రతీ పెట్రోల్ బంకులో ఇప్పటికే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ లేకపోయినా ఇకపై బంకుల్లో ఫస్ట ఎయిడ్ కిట్ తప్పనిసరి.
ఒకవేళ పెట్రోల్ బంకులో ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే.. అది యాజమాన్యానికి తెలియజేయడానికి ఒక ఫిర్యాదుల పెట్టె తప్పనిసరి. అంతే కాకుండా చాలావరకు పెట్రోల్ బంకుల్లో నాణ్యతలేని పెట్రోల్, డీజిల్‌ను ప్రజలకు అందిస్తుంటారు. కానీ ఇప్పటినుండి వారికి అందుతున్న పెట్రోల్, డీజిల్ నాణ్యత ఏంటో వారే తెలుసుకునేలా వారికి పరికరాలను అందజేయనున్నారు.