Telangana Congress : అలాంటి వారికే పదవులు.. కాంగ్రెస్ లో కొత్త రూల్..

Update: 2026-03-03 05:05 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షులకు ట్రైనింగ్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పార్టీని గ్రౌండ్ లెవల్లోబలంగా పాతుకుపోయేలా చేయడం లాంటివాటిపై అధినేతలు దృష్టి పెడుతున్నట్టు సమచారం. అందులో భాగంగానే డీసీసీ అధ్యక్షులు ట్రైనింగ్ ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో కేవలం పనిచేసిన వారికి మాత్రమే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా ఉండదని.. పార్టీ కోసం ఎవరు కష్టపడితే వారికే ఫలితాలు దక్కుతాయని తేల్చి చెప్పారు. దీంతో ఇది ఒక రకంగా చాలా మంది సీనియర్లకు కొంత చేదు వార్తే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్లు ఇప్పటికీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో పార్టీకి దూరంగా ఉంటున్న వారు కూడా లేకపోలేదు.

వారందరికీ చెక్ పెట్టేలా రాహుల్ కామెంట్లు ఉన్నాయంటున్నారు. డబ్బుల, హోదా, సీనియార్టీని బేరీజు వేసుకోకుండా కేవలం పనితనాన్ని మాత్రమే బేరీజు వేసుకుని పదవులు కేటాయించడం అంటే మంచిదే అని కొందరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం తాము పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తించాలని కోరుతున్నారు. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటన మీద. అయితే రేవంత్ మాత్రం తన లాగా పనిచేసిన వారికే పదవులు వస్తాయంటున్నారు. దీంతో ఇది కాస్తా కాంగ్రెస్ లో రెండు రకాలుగా ఎస్టాబ్లిష్ అవుతోంది.

Tags:    

Similar News