Hyderabad: లంగర్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ గోదాంలో మంటలు..
Hyderabad: హైద్రాబాద్ లంగర్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.;
Hyderabad: సికింద్రాబాద్ లంగర్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫాత ఫర్నిచర్ గోదాంలో మంటలు ఎగసిపడడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాదం ఎలా సంభవించింది అనేదానిపై ఇంకా సమాచారం రాలేదు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ప్రాణ హాని జరగనందుకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరి కాసేపట్లో మంటలు అదుపులోకి వస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.