Secunderabad: సికింద్రాబాద్ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం..
Secunderabad: సికింద్రాబాద్‌లోని నల్లగుట్ట ప్రాంతంలోని హైరైజ్ షాపింగ్ మాల్‌లోని నైట్‌వేర్ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.;
Secunderabad: సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతంలోని హైరైజ్ షాపింగ్ మాల్‌లో ఉన్న నైట్‌వేర్ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాల్ నుండి వెలువడుతున్న దట్టమైన పొగ సమీపంలోని పలు భవనాలను చుట్టుముట్టడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లు, క్రేన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనం పైభాగంలో చిక్కుకున్న ఆరుగురిని రక్షించారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.