Warangal: వరంగల్‌లో బండి సంజయ్ ఫ్లెక్సీల కలకలం.. చెప్పులు మోసే బానిసనంటూ..
Warangal: వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ వద్ద బండి సంజయ్ ఫ్లెక్సీల కలకలం సృష్టిస్తున్నాయి.;
Warangal: వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ వద్ద బండి సంజయ్ ఫ్లెక్సీల కలకలం సృష్టిస్తున్నాయి. తాను ఢిల్లీ గులాముల చెప్పులు మోసే బానిసనంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ కార్యకర్తలు.. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఇది ముమ్మాటికీ టీఆర్‌ఎస్ కార్యకర్తల పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.మొన్న అమిత్‌షా పర్యటనలో బండి సంజయ్ షా చెప్పులు అందివ్వడంపై విపక్షాలు విమర్శించాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు.