TS : ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి?

Update: 2024-04-10 04:53 GMT

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు (Mandava Venkateswara Rao) పేరు ఖరారైనట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవకు.. సీఎం రేవంత్‌ ఒకప్పుడు సన్నిహితుడు. దీంతో ఆయన అభ్యర్థిత్వానికి అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికేతరుడికి ఎలా టికెట్ ఇస్తారంటూ కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నట్లు టాక్.

మండవ వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంతరెడ్డి బాల్ రెడ్డి పై 7726 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆయన 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1997లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖమంత్రిగా పనిచేశారు. మండవ వెంకటేశ్వరరావు 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పనిచేసి, 2002లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు .

2004లో ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన 2008 (ఉప ఎన్నిక) 2009, 2010 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి 2019 ఏప్రిల్ 05న వెళ్లిన కేసీఆర్‌ ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన ఏప్రిల్ 06వ తేదీన ప్రగతి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు 2023 నవంబరు 25న బోధన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Tags:    

Similar News