Harish Rao : ప్రజా వైద్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 స్థానంలో ఉంది: హరీశ్‌రావు
Harish Rao: సీజనల్ వ్యాధుల సమయంలో రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు వస్తున్నారని.. అందుకే కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మిస్తున్నామని అన్నారు;
Harish Rao: హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో కొత్త OPD బ్లాక్‌కు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. 13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, TSMSIDC ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, DME రమేశ్‌రెడ్డి, IPM డైరెక్టర్, ఫీవర్ హాస్పిటల్ ఇన్‌ఛార్జ్ శంకర్‌తో పాటు.. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతిమీనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుందన్న మంత్రి హరీశ్‌రావు.. సీజనల్ వ్యాధుల సమయంలో రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు వస్తున్నారని.. అందుకే కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉచితంగా పార్థీవ వాహనాలను ప్రవేశపెట్టిందన్న హరీశ్‌రావు.. మార్చురీల ఆధునీకరణకు 32కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ప్రజా వైద్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు.