ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు..!
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్2న ఢిల్లీ వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు.;
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్2న ఢిల్లీ వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు ఉండబోతోంది. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాటుతో టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించబోతోంది.